కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ – సముద్రఖని

Dethadi Glimpse to Release on March24
ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా ‘దేత్తడి’ గ్లింప్స్ మార్చి 24న రిలీజ్
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఆశిష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్ మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్లో బ్లాక్, రెడ్ షేడ్స్‌తో రా ఎనర్జీ కనిపిస్తోంది. హీరో వెనుక నుంచి కనిపిస్తూ ఫైర్ బ్రీతింగ్ యాక్ట్ చేస్తున్న విజువల్ ఆసక్తిని పెంచుతోంది.
“’దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది. మెయిన్ స్ట్రీమ్‌లో ఎక్కువగా చూడని అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
తారాగణం: ఆశిష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు)
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
