
The Girlfriend has won 3 awards at the Sri Kalasudha Telugu Association Ugadi Awards
The Girlfriend, starring National Crush Rashmika Mandanna, continues to win awards one after another. Recently, Rashmika won the Best Actress award for this film at the Gaddar Awards.
Now, the movie has secured three more awards at the Sri Kalasudha Telugu Association Ugadi Awards. At the 28th Ugadi Awards ceremony held in Chennai, Rashmika received the Best Actress award, while Dikshit Shetty won Best Villain. In the Best Writing and Direction category, the Bapu-Ramana Award was won by director Rahul Ravindran.
Dikshit Shetty and Rahul Ravindran attended the awards ceremony and received their honors from Union Minister Pemmasani Chandrasekhar.
The film was presented by Allu Aravind and jointly produced under the banners of Geetha Arts and Dheeraj Mogilineni Entertainment. It was directed by Rahul Ravindran, with Dheeraj Mogilineni and Vidya Koppineedi serving as producers.
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరుసగా అవార్డ్స్ సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు ఉత్తమ నటిగా రశ్మిక గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో ఈ సినిమాకు మూడు అవార్డ్స్ దక్కాయి. చెన్నైలో జరిగిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 28వ ఉగాది పురస్కారాల్లో ఉత్తమ నటిగా రశ్మిక, ఉత్తమ విలన్ గా దీక్షిత్ శెట్టికి అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ రచన, దర్శకత్వం విభాగంలో బాపు రమణల పురస్కారం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గెల్చుకున్నారు. దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డ్స్ స్వీకరించారు.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.
