
1st Single Addira Lekka Released from Happy Raj
హ్యాపీ రాజ్ ఫస్ట్ సింగిల్ అద్దిరా లెక్క రిలీజ్
స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ “అద్దిరా లెక్క” సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. గాయకుడు గోవింద్ ప్రసాద్ ఎనర్జీతో పాడిన ఈ పాటకు రెహ్మాన్ రాసిన లిరిక్స్ మంచి వైబ్ తీసుకొచ్చాయి.
ఈ సాంగ్‌లో జివి ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చాయి.
రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్స్టంట్ హిట్‌గా మారింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధన్ క్రిస్టోఫర్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఆర్కె సెల్వ, ప్రొడక్షన్ డిజైనర్ కుమార్ గంగప్పన్.
హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సపోర్ట్ తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకోనుంది.
తారాగణం: జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ, అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్, అదుర్చి అరుణ్, మధురై ముత్తు, దేవి మహేష్, సోఫాబాయ్ రసూల్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం- మరియా రాజా ఎలాంచెజియన్
నిర్మాత- జైవర్ద
సహ నిర్మాత – జైకాంత్ సురేష్
తెలుగు రిలీజ్: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP
డీవోపీ-మధన్ క్రిస్టోఫర్
ఎడిటర్- ఆర్కే సెల్వ
సంగీతం- జస్టిన్ ప్రభాకరన్
ప్రొడక్షన్ డిజైనర్ – కుమార్ గంగప్పన్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రవీణ్ రాజా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- విశ్రేత్ కెఎల్
PRO: వంశీ-శేఖర్
