Sree Vishnu Vishnu Vinyasam Teaser Offers Laughter-packed Experience

Megastar Chiranjeevi’s Heartfelt Tribute To Wife Surekha
Megastar Chiranjeevi has once again shown that beyond the stardom, he is a man of deep emotion and gratitude. His touching birthday note to his wife Surekha has been winning hearts for its sincerity and warmth.
Their journey, which began on February 20, 1980, has spanned more than four remarkable decades- a journey built on companionship, trust, and unwavering mutual support. In his message, Chiranjeevi described Surekha as the “nucleus of our family”, the one who holds every relationship together with her affection and strength.
He went on to reveal what he calls the real secret behind his success. Not awards, not fame, not hard work- but Surekha herself. By carrying family responsibilities with grace and quiet resilience, she gave him the freedom to give his all to cinema. To him, she is not just a partner, but the foundation that kept his world steady.
Chiranjeevi also expressed how Surekha embraced his parents and siblings as her own, earning love and respect that transcended the usual roles in a household. From celebrations to crises, she stood at the centre of every moment, anchoring the family with calmness and care.
As her birthday arrives alongside the week of their wedding anniversary, the Megastar’s words turned even more heartfelt: “I am what I am because of you.”
His post is more than a birthday wish. It is a tribute to 46 years of togetherness, a reminder that behind every legacy lies a silent force of strength. For Chiranjeevi, that force has always been Surekha, the woman who walked every step of life with him, hand in hand.
భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి – ప్రేమతో నిండిన అద్భుత బంధానికి అందమైన వేడుక
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టార్డమ్కు మించి, తనలోని భావోద్వేగాన్ని, కృతజ్ఞతను చూపించారు. తన భార్య సురేఖకు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన హృద్యమైన సందేశం నిజాయితీతో, ఆప్యాయతతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.
”నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు
1980 ఫిబ్రవరి 20న మనం వివాహం చేసుకున్న నాటినుంచి నువ్వే నా బలంగా మారావు. ఈరోజు నీ పుట్టినరోజును, ముందుగానే మన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.
నువ్వే మన కుటుంబానికి కేంద్రబిందువు. అందరినీ ప్రేమతో కట్టిపడిపే శక్తి. నా కుటుంబ సభ్యులను నీ వారిలా చూసుకుని, ప్రతి సందర్భంలో వారికి అండగా నిలబడి, నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారావు. వారు కూడా నిన్ను అంతే ప్రేమతో దగ్గర చేసుకున్నారు.
నా విజయానికి రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే… అది నా ప్రతిభ, కృషి కాదు — “అది నువ్వే”. ఎందుకంటే నువ్వు ప్రతి బాధ్యతను తీసుకున్నావు కాబట్టి నేను నా వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను.
ప్రతి కష్టంలోనూ, ప్రతి ఆనంద వేడుకలోనూ మనందరినీ ఒకటిగా నిలబెట్టేది నువ్వే. నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు… నా బలం, నా అండ, నా ప్రశాంతత.
ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా, అలాగే మన వివాహ వార్షికోత్సవం దగ్గరపడుతున్న ఈ సమయంలో, నా మనసు నుంచి ఒక మాట — నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను
ఎప్పటికీ ప్రేమతో… ఎల్లప్పుడూ నీతోనే. ”
ఈ పోస్టు కేవలం పుట్టినరోజు శుభాకాంక్ష మాత్రమే కాదు… 46 ఏళ్ల అనుబంధానికి ఒక గొప్ప ట్రిబ్యూట్. ప్రతి విజయం వెనుక ఒక మౌనమైన శక్తి ఉంటుందని, మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఆ బలం ఎప్పుడూ సురేఖ గారే అని ఇది గుర్తు చేస్తోంది.
