
Seyon First Look Unveiled
Versatile star Sivakarthikeyan joins hands with director Sivakumar Murugesan for a new film produced by Kamal Haasan and R. Mahendran. Marking a significant reunion, Sivakarthikeyan join hands once again with RaajKamal Films International after the blockbuster success of Amaran, a film that garnered both critical acclaim and commercial triumph. This renewed collaboration further strengthens a creative partnership that continues to push boundaries.
Positioned as a grand rural commercial entertainer, the movie is titled “SEYON”. It is set to be the biggest family spectacle of 2026, blending rooted emotions, mass appeal, and wholesome entertainment for audiences across generations. The first look poster sees Sivakarthikeyan in a commanding, almost divine pose. Wearing a vest, dhoti, sacred ash, and prayer beads, he appears deeply rooted in tradition. A curved machete in his hand contrasts his calm posture, suggesting controlled violence- a man who protects, punishes, and commands fear at the same time. Behind him, a grand halo of peacock feathers and surrounding peacocks evokes Lord Murugan symbolism, giving the character a mythic aura rather than that of an ordinary villager. The movie indeed presents Sivakarthikeyan in a power-packed and dynamic new role.
Adding to the excitement, this project marks the first-ever collaboration between RaajKamal Films International, Sivakarthikeyan, and acclaimed composer Santhosh Narayanan. With his distinctive musical style and chart-defining soundtracks, expectations are soaring high for what promises to be a powerful and memorable album.
Backed by the legacy of RaajKamal Films International and the contemporary vision of Turmeric Media, “SEYON” is poised to be one of the most anticipated and celebrated releases of 2026.
Further updates on the cast, crew, and release plans will be announced soon.
శివకార్తికేయన్, శివకుమార్ మురుగేశన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, ఆర్కేఎఫ్ఐ, టర్మరిక్ మీడియా సెయాన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది.
గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “సెయాన్” అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టకిల్‌గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ డివైన్ ల్లూక్ కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తూ, చేతిలో వంపు ఉన్న కత్తి ఆయన ప్రశాంతత వెనుక దాగిన శక్తిని సూచిస్తోంది. వెనుకన కనిపించే నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ ఆరా అందిస్తున్నాయి. ఈ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్, డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు.
రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్‌తో, చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్‌తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా విజన్ కలిసిన “సెయాన్” 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది.
నటీనటులు, సాంకేతిక బృందం, రిలీజ్ వివరాలపై మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.
తారాగణం: శివకార్తికేయన్
దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
నిర్మాత: కమల్ హాసన్ – ఆర్. మహేంద్రన్
బ్యానర్స్: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా
సంగీతం: సంతోష్ నారాయణన్
