
Maremma Intense & Devotionally-Packed Teaser Unveiled
Maadhav, son of actor Raghu and nephew of Mass Maharaja Ravi Teja, steps into the spotlight as a lead actor with the rustic action-drama Maremma. The film, set against an intense rural backdrop, marks the directorial debut of Manchala Nagaraj and is produced by Mayur Reddy Bandaru under Moksha Arts, their maiden venture. The makers who earlier made good impression with the film’s first look poster, unveiled its teaser today.
An outbreak grips the village, claiming the lives of both people and cattle. Desperate for relief, the villagers pray to the village deity, Maremma Thalli, seeking a divine solution. The protagonist is the guardian of the sacred bull belonging to the goddess- until one day, the bull mysteriously goes missing.
Though this is Maadhav’s debut film, he wisely chooses a story that aligns with current audience tastes. He appears in a completely rustic makeover and impresses with an intense performance. He indeed didn’t look like a debutant. Deepa Balu plays the female lead opposite him, while senior actor Vinod Kumar makes a solid impact as the village head.
For his first outing, director Mancharla Nagaraj weaves a story inspired by real events that took place in Telangana, set against an authentic village backdrop. Cinematographer Prasanth Ankireddy captures the rural atmosphere with striking realism, and music director Prashanth R Vihari heightens the tension with his powerful background score. Dev Rathod is the editor, and Rajkumar Murugesan is the art director.
Overall, the teaser has significantly raised expectations for the film. The makers have announced that the film Maremma will hit theatres soon.
Cast: Maadhav, Deepa Balu, Vinod Kumar, Vikas Vasishta, Dayanand Reddy, V.S.Rupa Lakshmi
Technical Crew:
Banner: Moksha Arts
Written & Directed By: Manchala Nagaraj
Producer: Mayur Reddy Bandaru
Executive Producer: Umesh Vilaasagaram
Dop: Prasanth Ankireddy
Music Director: Prashanth R Vihari
Editor: Dev Rathod
Art Director: Rajkumar Murugesan
Action Director: Madigonda Natraj
Choreographer: Saggy Sagar
Vfx Producer: Chandra Kayala
Designer: Sunandini Vijjagiri
Lyricists: Mittapalli Surender, Kamal Eslavath
Stills & Making: Shekhar Kathula
Publicity Designs: Ananth Kancherla
PRO: Vamsi Shekar
‘మారెమ్మ’ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది. మాధవ్ కూడా రవితేజ గారిలా స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.
ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి, ప్రజలు, పశువుల ప్రాణాలను బలిగొంటుంది. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన పవిత్ర ఎద్దును కాపాడే బాధ్యత హీరోది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఇక్కడినుంచే కథ కీలక మలుపులు తిరుగుతుంది.
ఇది మాధవ్‌కు తొలి చిత్రమైనప్పటికీ, అతను ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండే కథను ఎంచుకున్నాడు. పూర్తిగా రూరల్ లుక్‌లో కనిపించిన మాధవ్, తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నాడు. తొలి సినిమానే ఎంతో అనుభవం వున్నా నటుడిలా అనిపించాడు. అతనికి జోడీగా దీపా బాలు నటించగా, గ్రామ పెద్ద పాత్రలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ బలమైన ముద్ర వేశారు.
తన తొలి ప్రయత్నంలోనే దర్శకుడు మంచర్ల నాగరాజు తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో ఉత్కంఠను పెంచారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
మొత్తం మీద, ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ‘మారెమ్మ’ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని టీం అనౌన్స్ చేసింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ కు అతిధిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రవితేజ గారితో జర్నీ చేస్తున్నప్పుడు మాధవ్ ని చూస్తూ ఉండేవాణ్ణి. రవితేజ గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా రవితేజ గారి ఫాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు. ఈ టీజర్ లో నాకు మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎక్సైటింగ్ గా ఉంటుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ గుడ్ లక్.
హీరో మాధవ్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, మా అన్నయ్య మాస్ మహారాజా రవితేజ గారి ఫాన్స్ కు నమస్కారం( నవ్వుతూ) ఈ వేడుకకు విచ్చేసిన బాబి గారికి ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి షూటింగ్ మొదలుపెట్టాం.ఇప్పుడు టీజర్ తో మీ ముందు మీ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. నాగరాజు గారు టీజర్ ని అద్భుతంగా చూపించారు. ఈ స్క్రిప్ట్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. నిర్మాతలకు థాంక్యు సో మచ్. విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. విహారి మ్యూజిక్ ఇరగదీసాడు. టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్.
హీరోయిన్ దీపా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.
డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇందులో చూపించిన మైసాపురం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కథ, పాత్రలు మా ఊర్లో కూడా జరిగింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
యాక్టర్ వికాస్ వశిష్ట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇంత మంచి సబ్జెక్ట్ నిర్మించిన నిర్మాతలకు థాంక్యూ సో మచ్. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి థాంక్యూ. మేమందరం కొత్తవాళ్లైనప్పటికీ ఒక అద్భుతం టీం తో వర్క్ చేశాం. సినిమా ఒక ఆడియన్స్ గా చూశా. ఎక్సలెంట్ గా ఉంది. దర్శకుడు నాగరాజుకి అభినందిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx ప్రొడ్యూసర్: చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ శేఖర్
