
The Third Gear Singari released From Pan India Film Dude
Young sensation Pradeep Ranganathan, who has captivated audiences with back-to-back hits like Love Today and Dragon, is all set to charm this Diwali with his upcoming pan-India release, Dude. Directed by debutant Keerthiswaran and produced by the prestigious Mythri Movie Makers, the film pairs Pradeep with Premalu sensation Mamitha Baiju in what promises to be a vibrant romantic entertainer.
As part of its musical rollout, the third single from the film, titled Singari, is now out. Composed and sung by Sai Abhyankar, the song is a fun, high-energy track loaded with quirky lyrics, pulsing electronic beats, and youthful charm. With humorous lines penned by lyricist Ramajogayya Sastry and additional flavor from a group of female singers, the track delivers an instantly memorable and upbeat vibe.
The visuals of Singari add to its charm, showcasing Pradeep’s impeccable comic timing in a series of lighthearted and playful scenes.
With Sai Abhyankar making a strong debut in feature film music, and the song resonating strongly with youth across languages, Singari is expected to become a potential chartbuster.
Technically too, Dude boasts an impressive crew with Niketh Bommi handling cinematography, Barath Vikraman on editing, and Latha Naidu taking charge of production design.
Set for a grand Diwali release on October 17, Dude will hit screens in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada, offering a colorful celebration of romance, comedy, and music.
Cast: Pradeep Ranganathan, Sarath Kumar, Mamitha Baiju, Rohini Molleti, Hridhu Haroon, Dravid Selvam & Others.
Technical Crew:
Writer & Director: Keerthiswaran
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
CEO: Cherry
Executive Producer: Anil Yerneni
Music: Sai Abhyankkar
Cinematographer: Niketh Bommi
Production Designer: Latha Naidu
Costume Designer: Poornima Ramaswamy
Editor: Barath Vikraman
Tamil PRO: Suresh Chandra, Satish
Telugu PRO: Vamsi-ShekarMarketing: First Show
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, సాయి అభ్యాంకర్, కీర్తిశ్వరన్, మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘డ్యూడ్’ నుంచి హై-ఎనర్జీ ఫన్ ట్రాక్ సింగారి రిలీజ్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా విడుదలైన బూమ్ బూమ్, బాగుండు పో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
మ్యూజిక్ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సింగారి’ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్ ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్ కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది. ఫన్ ఫుల్ గా వినిపించే ఈ ట్రాక్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
ప్రదీప్ అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు పాటకు మరింత మజాను తెచ్చాయి.
సాయి అభ్యంకర్ తన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే అన్ని భాషల యువతరంలో సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నికేత్ బొమ్మి, ఎడిటర్ భరత్ విక్రమన్, ప్రొడక్షన్ డిజైనర్ లతా నాయుడు.
డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: భరత్ విక్రమన్
తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో