
Mario First Look Poster Unveiled
Director Kalyanji Gogana, known for his distinct style in films like Natakam and Thees Maar Khan, treated film lovers this Dussehra with the striking first-look poster of his upcoming project, Mario. The poster, released today, immediately captures attention with its gritty, action-packed, stylish, and romantic vibe, carrying the tagline: ‘A Turbo-Charged Ramp Ride.’
The first look presents the lead pair- debutant hero Anirudh and the gorgeous Hebah Patel, in a powerful and intense pose. Anirudh is seen holding a rifle, radiating a brooding intensity, while Hebah Patel, in a stunning red outfit, completes the dynamic composition. The dark, rain-soaked backdrop featuring a classic car suggests a high-stakes, thriller theme, promising a film that blends edge-of-your-seat moments with ample entertainment.
Mario is being produced by Silver Screen Productions in association with Rizwan Entertainment banner. Director Kalyanji Gogana, known for successfully blending comedy and thrill in his previous works, is set to deliver yet another engaging experience.
The film boasts strong technical team, with Sai Karthic along with Rakendu Mouli composing the music, which is expected to be a major highlight. Rakendu Mouli has also supported Gogana in developing the story and dialogues. MN Reddy handles the cinematography, while Manikanth and Madee Mannepalli are the editors.
Currently, the film is in full-scale production. The first-look poster has certainly created a significant buzz this festive season.
Cast: Anirudh, Hebah Patel, Rakendu Mouli, Mourya Siddavaram, Yashna Muthuluri, Kalpika ganesh, Madee Mannepalli, Latha Reddy
Technical Crew:
Banners: Silver Screen Production, Rizwan Entertainment
Producer: Silver Screen Productions, Rizwan Entertainment
Director: Kalyanji Gogana
Story & Dialogues Contribution: Rakendu Mouli
Music Director: Sai Karthic, Rakendu Mouli
Cinematographer: MN Reddy
Editor: Manikanth, Madee Mannepalli
PRO: Sai Satish
Poster Designer: Pardhu Creations
*కళ్యాణ్ జీ గోగణ ‘మారియో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. దసరాకు ‘టర్బో-చార్జ్డ్’ ట్రీట్ ఇచ్చిన టీం*
‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక దసరా సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ‘మారియో’ నుంచి అప్డేట్ ఇచ్చారు. ‘మారియో’ నుంచి అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరినీ అలరించారు. ఈరోజు విడుదలైన ఈ పోస్టర్.. ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ వైబ్‌తో ఈ పోస్టర్ ఇట్టే ట్రెండ్ అవుతోంది.
ఫస్ట్ లుక్‌లో హీరో అనిరుధ్, హెబ్బా పటేల్ పెట్టిన పోజుతో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అర్థం అవుతుంది. అనిరుధ్ రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. హెబ్బా పటేల ఎరుపు రంగు దుస్తుల్లో డైనమిక్ గా కనిపిస్తున్నారు. క్లాసిక్ కారు, చీకటి, వర్షం ఇలా అన్నింటినీ చూస్తుంటే థ్రిల్లర్ థీమ్‌ను సూచిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగించేలా అన్ని రకాల కమర్షియల్ అంశాలను తగినంత వినోదంతో మిళితం చేసే చిత్రాన్ని అందించనున్నారు.
సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘మారియో’ చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్‌ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు.
ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు, మాటలు రాకేందు మౌళి సమకూరుస్తున్నారు. కథ, సంభాషణలను అభివృద్ధి చేయడంలో రాకేందు మౌళి కూడా గోగణకు మద్దతు ఇచ్చారు. MN రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్థాయి నిర్మాణంలో ఉంది. ఈ పండుగ సీజన్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ఖచ్చితంగా సంచలనాన్ని సృష్టించిందనే చెప్పొచ్చు.
తారాగణం: అనిరుధ్, హెబా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్లు: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
కథ, దర్శకత్వం : కళ్యాణ్ జీ గోగణ
రచనా సహకారం, పాటలు : రాకేందు మౌళి
సంగీత దర్శకులు : సాయి కార్తీక్, రాకేందు మౌళి
సినిమాటోగ్రాఫర్: ఎంఎన్ రెడ్డి
ఎడిటర్: మణికాంత్, మదీ మన్నెపల్లి
PRO : సాయి సతీష్
పోస్టర్ డిజైనర్: పార్ధు క్రియేషన్స్