Heartfelt thanks to the audience for making ‘Kannappa’ a phenomenal

AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ #90’s కంటెంట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది – శివాజీ
సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ…అందరికి నమస్కారం. చదువు అనేది చాలా అవసరం. ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఈ టైటిల్ వినగానే ఈటీవీలో #90కి మించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు. చదువు అనేది నేచురల్ గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కు వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది. ఈటీవీ విన్ కొత్తరకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు’అన్నారు,
హీరో సుహాష్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇందులో పని చేసిన రోషన్ భాను .. మిషన్ ఇంపాజిబుల్ నుంచి తెలుసు. చాలా మంచి యాక్టర్స్. ఈ సిరీస్ కి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు సంజిత్. డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ జోసెఫ్ కి ఆల్ ది బెస్ట్. ఇందులో పనిచేసిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈటీవీ నుంచి అద్భుతమైన కంటెంట్స్ వస్తున్నాయి.ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నాను. అందరికీ థాంక్యూ’అన్నారు.
షో రన్నర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు మీద దాదాపు ఏడాదిన్నర పాటు వర్క్ జరిగింది. మరో ఐదారు రోజుల్లో కంటెంట్ రిలీజ్ అవుతుంది. జోసెఫ్ ఈ కథని అద్భుతంగా చెప్పాడు. ఈ కథ వినగానే ఇందులో భాగమవాలనిపించింది. చాలా అద్భుతమైన జర్నీ ఇది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. దీనికి అందరూ కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ అవుతారు. పగలబడినవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్. ప్రతి డైలాగ్ కి కనెక్ట్ అవుతారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతి యాక్టర్ కి టెక్నీషియన్స్ కి థాంక్యూ. నితిన్, సాయి కృష్ణ గారు ఈ కంటెంట్ ని అద్భుతంగా నడిపించారు. చాలా ఓపికగా ముందుకు తీసుకెళ్లారు. సంజీత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. జులై 3న ఆల్ ఇండియా యాంకర్స్ రాబోతుంది. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు
డైరెక్టర్ జోషేఫ్ మాటల్డుతూ.. అందరికీ నమస్కారం. శివాజీ గారికి సుహాస్ గారికి సందీప్ గారికి థాంక్యూ. నా స్క్రిప్ట్ విని నన్ను బిలీవ్ చేసిన సాయి గారు నితిన్ గారు సందీప్ గారికి థాంక్యూ. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ కూడా మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈటీవీ విండ్‌లో ఈటీవీ విన్లో జులై 3న తప్పకుండా చూడండి’అన్నారు.
చాందిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శివాజీ గారికి సుహాస్ గారికి థాంక్యూ. సందీప్ గారికి ఈటీవీ విన్ యాజమాన్యానికి థాంక్యూ. నటీనటులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా అందర్నీ అలరించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.జూలై 3న తప్పకుండా అందరూ చూడండి’అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్టుకి కాంట్రిబ్యూట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంకో హిట్ కొడతాం. ఇంకో సక్సెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడదాం’అన్నారు
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. #90, వీరాంజనేయులు విహారయాత్ర, అనగనగా.. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి. ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ కూడా అద్భుతమైన విజయం సాధించబోతుంది. సందీప్ రాజు సుహాస్ మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. యూట్యూబ్‌లో క్రియేటివ్ కంటెంట్ చేసి డైరెక్టర్స్, స్టార్స్ కావచ్చుని నిరూపించారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. జోసెఫ్ ఈ ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దాడు. తను తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇందులో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఫ్యామిలీతో కలసి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.
యాక్టర్ హర్ష రోషన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం.సుహాస్, శివాజీ గారికి థాంక్యూ. ఈ ప్రాజెక్టులో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు .ఈ ప్రాజెక్టును చాలా ఎంజాయ్ చేసాం. ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీం అందరూ పాల్గొన్నారు.