K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

సంచలనాలకు తెర లేపబోతున్న ధర్మచక్రం మూవీ
తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా” నోటు రుచి మరిగిన వారికి పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుందనే” సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ధర్మం గెలుస్తుంది అనే సందేశాన్ని తెరకేక్కించాము. రాముడుని అడవికి పంపించే దాక మందర నిద్రపోని విధంగా…, ఈ సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ…., ‘ధర్మచక్రం’ సినిమా సూపర్ హిట్ అవుతుంది., చంద్రబాబునాయుడుగారు చరిత్రకారుడు అవుతారు అని ధర్మచక్రం ఋజువు చేస్తుంది అని SIFAA సంస్థ ధీమాగా ఉంది. రాముడు దేవుడయ్యాడు, మందర చరిత్ర హీనమైంది. విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినోత్సవం పురస్కరించుకొని మహానాడు పర్వదిన సందర్బంగా “ధర్మచక్రం “సినిమా ఆడియో విడుదల కావడం సంతోషంగా ఉందని అన్నారు…
సినిమా విడుదలకు ముందు, SIFAA గ్రూప్ సభ్యులు ఐకమత్యంతో సోషల్ మీడియాలో ‘ధర్మచక్రం’ పాటలను, చిత్ర విశేషాలను ప్రచారం చేసి, జాతరో జాతర సృష్టించాలని చిత్ర యూనిట్ పిలుపునిచ్చింది. , SIFAA సంస్థ తమ విలువలకు కట్టుబడి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తోంది. సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
దర్శకుడు: వెంకటరమణ పసుపులేటి
లిరిక్స్: వెంకటరమణ పసుపులేటి
సంగీతం: రాజకిరణ్
గాత్రం: మాళవిక, రాంకీ, వినాయక్,
పీఆర్వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల