Lovely Number Bhalle Bhalle From Nari Nari Naduma Murari Unveiled

థగ్ లైఫ్ – యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్
ఇండియన్ సినిమా లెజెండరీస్ కమల్ హాసన్, మణిరత్నం హైలీ యాంటిసిపేటెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్ను ఇవాళ విడుదల చేసింది.
ట్రైలర్ ఆరంభం నుంచే నమ్మకద్రోహం, ఈగో కూడిన వరల్డ్ లోకి ఆడియన్స్ ని తీసుకెళుతుంది. కమల్ హాసన్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో అదరగొట్టారు. శింబు, కమల్ బాండింగ్ కథలో వెరీ క్రూషియల్. కమల్ హాసన్ ఫెరోషియస్ పాత్రలో కనిపించగా, సింబు పాత్ర యంగ్ ఎనర్జీ వుంది.
ఇది మామూలు రివెంజ్ స్టొరీ కాదు ఒక సిద్ధాంత పోరాటం. మణిరత్నం ఈ భావోద్వేగ కథని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్ న్యూయాన్స్తో ఎక్సయిట్మెంట్ పెంచింది.
రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఏఆర్ రెహమాన్ బీజీఎం ఒక ఎపిక్ స్టొరీని వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేసింది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ రేజర్షార్ప్ గా ప్రతి మూమెంట్ వాల్యుబుల్ గా వుంది.
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో వున్నాయి.
ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. థగ్ లైఫ్ థియేటర్లలో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది.
