ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Kali is a Film with Strong Content – Varun Tej at Pre-Release Event
Young actors Prince and Naresh Agastya star in the upcoming film “Kali,” produced by Rudra Creations and presented by renowned writer K. Raghavendra Reddy. Directed by Siva Sashu, the film is a psychological thriller set for a grand theatrical release on the 4th of this month. Ahead of the release, the pre-release event was held in Hyderabad, with Mega Prince Varun Tej as the chief guest.
At the event, actor Mahesh Vitta shared, “I dubbed the character of the Cockroach in ‘Kali.’ Along with me, Priyadarshi and Ayyappa Sharma contributed voices, which are featured throughout the film. I thank director Siva Sashu for allowing me to be part of this innovative project.”
Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy praised the film’s content, saying, “The storyline of ‘Kali’ is excellent. I hope it becomes a massive success. Many farmers and students suffer from pressure that leads to suicide. If we can encourage them to think differently, we can prevent such tragedies. The film aims to deliver this important message.”
DOP Danny commented on the film’s visuals, stating, “The cinematography in ‘Kali’ is impressive. Nishant has done a fantastic job. You can see the dedication of the entire team in the making video. I hope the audience responds positively to the film.”
Director Balagam Venu encouraged viewers to watch “Kali,” saying, “Prince shared this project with me, and I believe it will resonate well with young audiences. Along with entertainment, it carries a significant message. We should all support such meaningful efforts.”
Director Mallik Ram expressed his admiration for the film, saying, “Prince is a good friend of mine, and he spoke highly of ‘Kali.’ The visuals are stunning, and I hope it becomes a big hit.”
Presenter K. Raghavendra Reddy highlighted the film’s social relevance, stating, “Suicide is a pressing issue in our society today. By addressing suicidal thoughts, we can save many lives. We made ‘Kali’ with this message in mind. Our producer, Leela Gautam Varma, passionately brought this film to life, and both Prince and Naresh delivered remarkable performances. I hope for your support.”
Producer Leela Gautam Varma expressed gratitude to the guests at the event, including Varun Tej, Allari Naresh, Priyadarshi, Balagam Venu, Akash Anna, and others. “Thanks to Nag Ashwin for releasing our teaser, to Prabhas for sharing it on social media, and to Prashanth Varma for releasing the trailer. ‘Kali’ will be in theaters on the 4th. We hope you all will watch and support our film,” she said.
Director Siva Sashu said: “The performances of Prince and Naresh in ‘Kali’ will impress everyone. We truly understand the pain when we fall; ten people learn if we rise again. This is the essence of ‘Kali.’ Our team was incredibly supportive throughout the filming process, and we thank them all. We aimed to deliver our best output, and we hope for your support.”
Heroine Neha Krishnan remarked: “‘Kali’ is my first theatrical release. I had previously worked on two films that were released on Aha. I flew in from America last night to see my movie in theaters here in my hometown Hyderabad. I am currently shooting another film in the US. I am thrilled to act alongside Prince and Naresh in this heart-touching film that conveys an anti-suicide message. I encourage everyone to watch it in theaters with me.”
Actor Priyadarshi expressed: “Prince is my best friend. When he mentioned ‘Kali,’ I encouraged him to pursue roles similar to those in ‘Bus Stop’ and ‘DJ Tillu.’ However, he assured me that the subject matter was compelling. This film addresses the rising suicide rates in our country post-COVID, making it a purposeful project. I lent my voice to the character of Balli, and I believe ‘Kali’ should be a significant hit. Best of luck to the entire team!”
Hero Akash Jagannath added: “I’m happy to be part of this event for ‘Kali.’ The trailer showcases intriguing content, and creating a film with limited locations is a challenge. The team has put in remarkable effort. If the film is good, the Telugu audience will undoubtedly support it.”
Hero Prince expressed his gratitude: “Thank you to Varun, Naresh, Akash, and all the guests at our ‘Kali’ event today. Rebel Star Prabhas anna shared our Kali Teaser and our film got more reach in audience and trade circles. Lot of Distributors also enquired about the film. Thanks a lot anna. When ‘Kali’ was announced, my friends suggested I stick to romantic films. However, deep emotions inspired me to make this film. The suicide of my favorite hero, Uday Kiran, has affected me profoundly, and the loss of my close friend, who also committed suicide, left me heartbroken. I felt compelled to address this issue through storytelling. I assure you, ‘Kali’ will not disappoint; it features thrilling elements, great music, and engaging characters. Thanks to director Siva Sashu, producer Gautham, presenter Raghavendra Reddy, and JB for the captivating music. Let’s meet in theaters on the 4th to watch ‘Kali.'”
Hero Allari Naresh remarked: “I’ve known Prince for a long time, and he has quickly established himself as a talented actor. I hope ‘Kali’ brings him another success. Though Naresh Agastya couldn’t attend, his performance is commendable. ‘Kali’ presents a meaningful concept regarding suicides. Be sure to watch it in theaters. Director Siva Sashu, producer Leela Gautam, DOPs Nishant and Ramana, and heroine Neha are all newcomers in this project. I understand the challenges for newcomers during their film’s release, so let’s support them in achieving success with their first film.”
Mega Prince hero Varun Tej said: “I’m delighted to attend the event for ‘Kali.’ Along with me are Naresh, Priyadarshi, and Akash. Prince is a close friend and a dedicated actor. While he shines in lead roles, he has also taken on supporting roles in films like ‘DJ Tillu’ and ‘Skanda,’ gaining recognition through them. He shared exciting details about this film with me. If the content is good, the Telugu audience will surely appreciate it. We hope ‘Kali’ receives your support. Best wishes to producer Leela Gautam Varma, director Siva Sashu, heroine Neha, and the entire team.”
Cast: Prince, Naresh Agastya, Neha Krishnan, Gauthamraju, Gundu Sudarshan, Kedar Shankar, Mani Chandana, Madhumani, etc.
Technical Team:
- Music: Jeevan Babu (JB)
- Editor: Vijay Cutts
- Cinematography: Nishanth Katari, Ramana Jagarlamudi
- Songs: Saraswati Putra Ramajogayya Sastry
- Creative Producers: Radhakrishna Tatineni, Dharani Kumar TR
- Executive Producer: Phaniendra
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Presented by: K. Raghavendra Reddy
- Producer: Leela Gautam Varma
- Written and Directed by: Siva Sashu
మంచి కంటెంట్ తో వస్తున్న “కలి” సినిమాకు ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నటుడు మహేశ్ విట్ట మాట్లాడుతూ – “కలి” సినిమాలో బొద్దింక క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాను. నాతో పాటు ప్రియదర్శి, అయ్యప్ప శర్మ గారు వాయిస్ ఇచ్చారు. మా ముగ్గురు వాయిస్ లు సినిమా అంతా ఉంటాయి. నాతో ఈ కొత్త అటెంప్ట్ చేయించిన దర్శకుడు శివ శేషుకు థ్యాంక్స్. అన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – “కలి” సినిమాకు సంబంధించిన కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. రైతులు, విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారు ఒక నిమిషం ఆలోచిస్తే ఇలాంటి అనర్థాలు జరగవు. ఇలాంటి ఒక మంచి పాయింట్ తీసుకుని ఆత్మహత్యలు వద్దు అని చెప్పే ప్రయత్నం “కలి” సినిమాతో చేస్తున్నారు మూవీ టీమ్. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు.
డీవోపీ డానీ మాట్లాడుతూ – “కలి” సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. నిషాంత్ మంచి కెమెరా వర్క్ చేశాడు. మేకింగ్ వీడియోలో టీమ్ లో ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. “కలి” సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు బలగం వేణు మాట్లాడుతూ – “కలి” సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్స్ లో చూడండి. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చెప్పాడు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక మంచి సందేశం ఈ మూవీలో ఉంది. యూత్ ఆడియెన్స్ కు మూవీ బాగా రీచ్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాలను మనమంతా అభినందించాలి. అన్నారు.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ – ప్రిన్స్ నాకు మంచి ఫ్రెండ్. ఈ “కలి” సినిమా గురించి చెప్పాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డీవోపీ నిషాంత్ కు కంగ్రాట్స్ . మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ- ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఈ పాయింట్ తో “కలి” సినిమాను నిర్మించాం. మా ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ ప్యాషనేట్ గా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ప్రిన్స్, నరేష్ చాలా బాగా నటించారు. ప్రిన్స్ సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. “కలి” సినిమాకు మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
నిర్మాత లీలా గౌతమ్ వర్మ మాట్లాడుతూ – ఈ రోజు మా “కలి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వరుణ్ గారికి, అల్లరి నరేష్ గారికి, ప్రియదర్శి, బలగం వేణు గారికి, ఆకాష్ అన్నకు మిగతా గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ అందించిన నాగ్ అశ్విన్ గారికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నయ్యకు, ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. మా “కలి” సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
దర్శకుడు శివ శేషు మాట్లాడుతూ – “కలి” సినిమాలో ప్రిన్స్, నరేష్ నటన మీ అందరినీ ఆకట్టుకుంటుంది. మనం పడితే ఆ బాధ మనకు తెలుస్తుంది. మనం తిరిగి నిలబడి ఎదిగితే అది పదిమందికి తెలుస్తుంది. “కలి” సినిమా కాన్సెప్ట్ ఇదే. చిత్రీకరణలో మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. మా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. మీరు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరోయిన్ నేహా కృష్ణన్ మాట్లాడుతూ – “కలి” సినిమా నా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. గతంలో నేను చేసిన రెండు చిత్రాలు ఆహాలో రిలీజ్ అయ్యాయి. నా మూవీని థియేటర్ లో నా సొంత ఊరైన హైదరాబాద్ లో చూడాలని నిన్న రాత్రి అమెరికా నుంచి వచ్చాను. యూఎస్ లో నా మూవీ ఒకటి షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, నరేష్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆత్మహత్యలు వద్దని చెప్పే హార్ట్ టచింగ్ మూవీ ఇది. మీరంతా నాతో పాటు థియేటర్ లో సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ – ప్రిన్స్ నాకు మంచి ఫ్రెండ్. “కలి” సినిమా గురించి ప్రిన్స్ నాకు చెప్పినప్పుడు నువ్వు బస్ స్టాప్, డీజే టిల్లు లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నాను. సబ్జెక్ట్ చాలా బాగుందని ప్రిన్స్ అన్నాడు. ఆత్మహత్యలు వద్దని చెప్పే చిత్రమిది. మన దేశంలో కోవిడ్ తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి. ఒక పర్పస్ ఉన్న మంచి సినిమా ఇది. ఈ చిత్రంలో బల్లి పాత్రకు వాయిస్ ఇచ్చా. “కలి” మూవీ మంచి హిట్ కావాలి. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ – “కలి” సినిమా ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. లిమిటెడ్ లొకేషన్స్ లో సినిమా చేసి మెప్పించడం అంటే ఈజీ కాదు. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం టీమ్ చేశారు. సినిమా బాగుంటే తెలుగు ఆడియెన్స్ తప్పకుండా చూస్తారు. “కలి” సినిమాకు కూడా మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ – ఈ రోజు మా “కలి” సినిమా ఈవెంట్ కు వచ్చిన వరుణ్ అన్నకు, నరేష్ గారికి, ఆకాష్ కు మిగతా గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. “కలి” సినిమా అనౌన్స్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు ఏవైనా లవ్, రొమాంటిక్ మూవీస్ చేసుకోవచ్చు కదా అని. కానీ ఈ సినిమా చేయడానికి కొన్ని ఎమోషన్స్ కారణం అయ్యాయి. నేను ఇష్టపడే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు ఎంతో బాధపడ్డాను. ఈ ఆత్మహత్యల నివారణకు ఏదో ఒకటి నా వంతు ప్రయత్నంగా చేయాలని అనిపించింది. ఆ టైమ్ లో “కలి” కథ నా దగ్గరకు వచ్చింది. ఇది తప్పకుండా చేయాలని అనుకున్నా. “కలి” సినిమా మిమ్మల్ని బాధపెట్టేలా ఉండదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి మ్యూజిక్ ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. మా డైరెక్టర్ శివ శేషు, ప్రొడ్యూసర్ గౌతమ్, ప్రెజెంటర్ రాఘవేంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్. మా మూవీకి జె.బి గారి మ్యూజిక్ ఆకర్షణ అవుతుంది. “కలి” సినిమా చూసేందుకు ఈ నెల 4వ తేదీన థియేటర్ లో కలుద్దాం. అన్నారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ – ప్రిన్స్ నాకు చాలాకాలంగా తెలుసు. తను అతి తక్కువ సమయంలో నటుడిగా ఎదిగాడు. మంచి మూవీస్ చేస్తున్నాడు. “కలి” సినిమా అతనికి మరో విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. నరేష్ అగస్త్య ఈరోజు ఈవెంట్ కు రాలేదు. అతని పర్ ఫార్మెన్స్ బాగుంటుంది. ఆత్మహత్యలు వద్దనే ఒక మంచి కాన్సెప్ట్ తో “కలి” సినిమా మీ ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. ఈ టీమ్ లో డైరెక్టర్ శివ శేషు, ప్రొడ్యూసర్ లీలా గౌతమ్, డీవోపీ లు నిషాంత్, రమణ , హీరోయిన్ నేహా వీళ్లంతా కొత్తవాళ్లు. కొత్త వాళ్లకు తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఎన్ని హోప్స్ ఉంటాయో నాకు తెలుసు. మీరంతా వాళ్లకు మొదటి సినిమాతోనే సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ – “కలి” సినిమా ఈవెంట్ కు హాజరవడం సంతోషంగా ఉంది. ఈ రోజు నాతో పాటు నరేష్ అన్న, ప్రియదర్శి, ఆకాష్ వీళ్లంతా ఈవెంట్ కు వచ్చారు. ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. “కలి” సినిమాకు కూడా మన ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ, డైరెక్టర్ శివ శేషు, హీరోయిన్ నేహా మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.
టెక్నికల్ టీమ్:
సంగీతం – జీవన్ బాబు
ఎడిటర్ – విజయ్ కట్స్.
సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.
పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి
నిర్మాత – లీలా గౌతమ్ వర్మ
రచన, దర్శకత్వం – శివ శేషు