దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
Director Vamshi Paidipally Released “Sri Sri Sri Rajavaru” Teaser
Young promising hero Narnay Nithin, who delivered back-to-back blockbusters with movies like “Mad” and “Ayy”, has teamed up with the talented director Satish Vegesna, who brought a National Award to Tollywood with the film “Shatamanam Bhavati”. The passionate producer Chintapalli Ramarao, known for his successful film “Gurtunda Seethakalam” under the banner of Sri Vedakshara Movies, is producing the exciting movie “Sri Sri Sri Rajavaru”. This film is being made as a love and family entertainer, with Sampada playing the heroine. The movie is gearing up for a grand theatrical release this Dussehra. Recently, the film’s teaser was launched by the renowned director Vamshi Paidipally.
Director Vamshi Paidipally spoke on the occasion:
“I watched the teaser of ‘Sri Sri Sri Rajavaru’ and it’s very good. The dialogue comparing love to elections is impressive. Director Satish Vegesna, who previously won a National Award with ‘Shatamanam Bhavati’, seems to be following a similar flavor with this movie. It is a good love and family entertainer. I know Narnay Nithin since the time of NTR’s marriage, and he has been growing as a promising hero with films like ‘Mad’ and ‘Ayy’. I believe ‘Sri Sri Sri Rajavaru’ will be another blockbuster for him. Satish Vegesna has presented him in a massy style. Ramarao has been eagerly waiting for this release, and I wish this movie to be a big success for him. My best wishes to producer Ramarao as well. Actors like Rao Ramesh and Naresh have performed well in this film. This is a perfect movie for families to watch together during the Dussehra festival. All the best to the ‘Sri Sri Sri Rajavaru’ team.”
Producer Chintapalli Ramarao spoke:
“We are happy that our movie ‘Sri Sri Sri Rajavaru’ teaser has been released by National Award-winning star director Vamshi Paidipally. We thank him for extending his best wishes to our team. After the success of ‘Mad’ and ‘Ayy’, our ‘Sri Sri Sri Rajavaru’ will be a hat-trick hit for the young and talented hero Narnay Nithin. Director Satish Vegesna, who won a National Award for ‘Shatamanam Bhavati’, has once again crafted a wonderful love and family entertainer. We have produced ‘Sri Sri Sri Rajavaru’ with a high budget without compromising on quality. We are bringing our movie to theatres this Dussehra, and we hope that it will double the Dussehra celebrations. We wish that you all celebrate the festival with our movie ‘Sri Sri Sri Rajavaru’.”
Cast:
Narnay Nithin, Sampada, Rao Ramesh, Naresh, Raghu Kunche, Praveen, Racha Ravi, Sarayu, Ramya, Priya Machiraju, Bhadram, Anand, Jabardast Nagi, and others.
Technical Team:
Music: Kailash Menon
Cinematography: Damu Narravula
Editor: Madhu
Lyrics: Srimani
Publicity Designer: Eshwar
Stills:ramesh.n
PRO: B. Veerababu
Presented by: Rangapuram Raghavendra, Murali Krishna Chintalapti
Co producer:subbareddy
Executive Producers: CH.V. Sharma, Rajeev Kumar
Producer: Chintapalli Ramarao,
Story & Direction: Satish Vegesna
స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతుల మీదుగా నార్నే నితిన్ ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీజర్ రిలీజ్
“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న, శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై “గుర్తుందా శీతాకాలం” వంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు”. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా…
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీజర్ చూశాను చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్ లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్ ను మాసీగా ప్రెజెంట్ చేశారు సతీష్ వేగేశ్న గారు. రామారావు గారు ఎప్పటినుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రామారావు గారికి కూడా నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. రావు రమేష్ గారు, నరేష్ గారు లాంటి మంచి యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్పెక్ట్ మూవీ ఇది. ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ – ఈ రోజు మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా టీజర్ ను నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన మా టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. మ్యాడ్, ఆయ్ సినిమాల తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో నార్నే నితిన్ కు మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా హ్యాట్రిక్ హిట్ కాబోతోంది. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న దర్శకులు సతీష్ వేగేశ్న గారు మరోసారి మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమాను హై బడ్జెట్ తో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. దసరాకు మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ దసరా సంబరాలను రెట్టింపు చేసే చిత్రమిది. మీరంతా దసరా పండుగను మా ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటీనటులు – నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి, తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం: కైలాష్ మీనన్
కెమెరా: దాము నర్రావుల
ఎడిటర్: మధు
పాటలు: శ్రీమణి
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్
స్టిల్స్: రమేష్. ఎన్
పీఆర్ఓ: బి. వీరబాబు
సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి
కో ప్రొడ్యూసర్:సుబ్బారెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీహెచ్.వి. శర్మ, రాజీవ్ కుమార్
నిర్మాత: చింతపల్లి రామారావు,
రచన – దర్శకత్వం: సతీష్ వేగేశ్న