Kanguva Trailer is Impressive with mesmerizing visuals
The highly anticipated movie ‘Kanguva,’ starring star hero Suriya, is directed by Siva and promises to be a grand period action film. Disha Patani and Bobby Deol play pivotal roles in this epic production. Produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of Studio Green and UV Creations, the film boasts a substantial budget and is set for a grand theatrical release worldwide on Dussehra, October 10. The trailer for ‘Kanguva’ was released today and is already impressing audiences with its mesmerizing visuals.
The trailer begins by introducing a stunning island, shrouded in mystery. Bobby Deol emerges as a fearsome villain, brutally killing those he encounters during wars and invasions. Suriya’s transformation into the fierce and commanding Kanguva, along with his intense performance, is the trailer’s highlight. As a leader, Kanguva’s bravery and dedication to protecting his people are striking. The battle scenes aboard massive ships are reminiscent of world cinema, and the high-quality visual effects add to the film’s appeal.
‘Kanguva’ is gearing up for a worldwide release on October 10. Mythri Movie Distributors, a renowned distribution company, will handle the release in the Nizam area.
Cast:
- Suriya
- Disha Patani
- Yogi Babu
- Bobby Deol
Technical Team: - Editor: Nishad Yusuf
- Cinematography: Vetri Palaniswamy
- Action: Supreme Sundar
- Dialogues: Madan Karke
- Story: Shiva, Adi Narayana
- Songs: Vivek, Madan Karke
- Costume Designers: Anu Varthan, Dashta Pillai
- Costumes: Rajan
- Choreography: Sobhi
- Executive Producer: AJ Raja
- Co-Producer: Neha Gnanavel Raja
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producers: KE Gnanavel Raja, Vamsi, Pramod
- Directed by: Siva
స్టార్ హీరో సూర్య, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ శివ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెస్మరైజింగ్ మేకింగ్ తో ‘కంగువ’ ట్రైలర్ ఆకట్టుకుంది.
‘కంగువ’ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. రహస్యాలెన్నో ఆ దీవిలో దాగిఉన్నాయి. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్ గా బాబీ డియోల్ కనిపించారు. అతనే ఒక సైన్యం లాంటి కంగువ పాత్రలో సూర్య మేకోవర్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. నాయకుడిగా తన వారిని కాపాడుకునేందుకు కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు వరల్డ్ సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ‘కంగువ’ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ