View

Chitram kadhu Nijam movie Review

Friday,April03rd,2015, 08:42 AM

చిత్రం - చిత్రమ్ కాదు నిజమ్
నిర్మాణం - గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
వీడియో చిత్రీకరణ - రమేష్ (లేట్)
విడుదల - 3.4.2015

ఏ సినిమా అయినా తెరకెక్కేది కాల్పనిక కథలతో. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక, ఆ కథలో దమ్ముంటే.. అప్పుడు సినిమా చూసినంతసేపూ అది నిజం జరుగుతున్నట్లుగా ప్రేక్షకులు ఫీలవుతారు. ఒక్కో కథ థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా వెంటాడుతుంది. కాల్పనిక కథలే ఇంత ప్రభావం చూపిస్తే. ఇక, నిజంగా జరిగిన విషయాలనే తెరపై చూపిస్తే... ప్రేక్షకులు ఆ నిజకథలో లీనమైపోతారు. సినిమాకి కావల్సిన పాటలు, ఫైట్లు, అదనపు కామెడీ ట్రాక్స్.. ఇలాంటివేవీ లేకపోయినా, జరిగిందే తెరపై చూస్తున్నాం కాబట్టి, బాగా లీనమయ్యే అవకాశం ఉంది. మరి.. నిజకథనే తెరపై చూపించిన 'చిత్రమ్ కాదు నిజమే' ఏ స్థాయిలో ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తుంది? ఈ నిజ కథ ఏ స్థాయిలో హిట్టవుతుంది?.. ఆ విషయాలనే తెలుసుకుందాం...

à°•à°¥
మాంద్య, బెంగుళూరుకు చెందిన రమేష్, నవీన్, కుమార్, ప్రకాష్, సౌమ్య, దీప మంగుళూరుకు 90కి.మీ దూరంలో ఉన్న అడవిలోకి ట్రక్కింగ్ చేయడానికి వెళతారు. 28 అక్టోబర్, 2010లో ఈ ఆరుగురు ట్రెక్కింగ్ చేయడం మొదలుపెడతారు. ఈ ట్రక్కింగ్ ని తన హెచ్.డి. కెమెరాతో షూట్ చేస్తుంటాడు రమేష్. ఈ ఫుటేజ్ చూపించి, ఏదైనా పెద్ద కెమెరా మ్యాన్ దగ్గర అసిస్టెంట్ గా చేరి, అనుభవం సంపాదించుకున్న తర్వాత కెమెరా మ్యాన్ కావాలన్నది రమేష్ లక్ష్యం. దట్టమైన అడవిలోకి వెళ్లిన వీరికి వింత అనుభూతులు ఎదురవుతుంటాయి. రకరకాల శబ్ధాలు వింటారు. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగుతారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ప్రకాష్ కి జ్వరం రావడంతో అతను ఆగిపోతాడు. మిగతా 5గురు పర్వతారోహణ దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి పయనమవుతారు. ఆ తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పిపోతారు. తర్వాత వారికి ఎదురైన సంఘటనల వల్ల నవీన్, దీప, రమేష్ చనిపోతారు. కుమార్ అడవుల్లోకి పారిపోతాడు. రమేష్ తో పాటు వాటర్ కోసం వెళ్లిన సౌమ్య తిరిగి రాదు. వీరు తిరిగి రాకపోవడంతో ప్రకాష్ ఫారెస్ట్ ఆఫీసర్ కి జరిగిన విషయాలు చెబుతాడు. పారెస్ట్ గార్డ్స్ జరిపిన ఆపరేషన్ లో నవీన్, రమేష్, దీప డెడ్ బాడీలు దొరుకుతాయి. సౌమ్య, కుమార్ మిస్ అయినట్టు రికార్డ్స్ లో నమోదవుతుంది. రమేష్ షూట్ చేసిన వీడియో పోలీసులకు దొరకడంతో వారు పడిన ఇబ్బందులు, చనిపోయిన విధానం వెలుగులోకి వస్తాయి. నిజంగా జరిగిన ఈ సంఘటన బెంగళూరులోని పలు వార్తా ప్రతికల్లో ప్రచురితమైంది. ఆ దొరికిన వీడియో ఫుటేజ్ ని అటవీ శాఖ, ఆరుగురు స్నేహితుల్లో మిగిలిపోయిన ప్రకాష్ అనుమతితో వెండితెరపై చూపించారు. అందుకే 'చిత్రమ్ కాదు నిజమ్' అని' టైటిల్ పెట్టారు.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రంలో కనిపించే పాత్రధారులెవరూ ప్రొఫెషనల్ నటీనటులు కాదు. ట్రెక్కింగ్ కి వెళుతూ... మార్గ మధ్యంలో తమకెదురైన అనుభవాలను వీడియో తీసుకుంటూ వెళ్లారు. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు మామూలు మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఈ పాత్రలు అలానే స్పందిస్తాయి. పాత్రధారులు నిజంగా ఎదుర్కొంటున్న సంఘటనలు కాబట్టి, వారి స్పందన సహజంగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

సాంకేతిక వర్గం
ఈ సినిమాకి టైటిల్ కార్డ్స్ ఉండవు. ట్రకింగ్ ని వీడియో షూట్ చేసిన రమేష్ ఒక్కడే ఈ చిత్రానికి ముఖ్యమైన సాంకేతిక నిపుణుడు. కాబట్టి సాంకేతిక నిపుణులంటూ ప్రత్యేకించి ప్రస్తవించడానికి ఏమీ లేదు. సినిమా మొత్తం మంచి క్వాలిటీతో ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఉత్కంఠగా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఆరుగురు స్నేహితులు ట్రక్కింగ్ చేస్తూ, తమ అనుభవాలను కెమెరాలో బంధిస్తారు. ప్రయాణంలో ఏవో శక్తులు తమను వెంటాడుతున్నట్లు ఊహిస్తారు. ప్రయాణం చేయలేక మానుకున్న ఒక్కడు బతికితే, ఇద్దరు ఏమైపోతారో తెలియదు.. మిగతా ముగ్గరు చనిపోతారు. ఇదంతా వీడియోలో చిత్రీకరించబడుతుంది. దొరికిన ఈ వీడియో ఫుటేజ్ నే వెండితెరపై ఆవిష్కరించారు. నిజంగా జరిగింది కాబట్టి, 'చిత్రమ్ కాదు నిజమ్' పేరుతో విడుదల చేశారు. మైసూర్ లో ట్రక్కింగ్ కి వెళ్లిన వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా. అయితే, ఈ చిత్రం చూసినవాళ్లు దొరికిన వీడియో ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని, సినిమాగా తీసి ఉంటారనీ, చనిపోయినవాళ్లు వేరు.. సినిమాలో నటించినవాళ్లు వేరు అనీ సందేహించే ఆస్కారం లేకపోలేదు. ఆ సందేహంలో నిజం ఎంత ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ 'చిత్రమ్ కాదు నిజమ్'ని చూడొచ్చు.

ఫైనల్ గా చెప్పాలంటే... కుర్చీల్లోంచి కదలకుండా చూసే చిత్రం ఇది. ఒకవేళ ఇది.. 'చిత్రమే... నిజంగా జరిగిన కథనే సినిమాగా మలిచారు' అని ఎవరైనా పాయింట్ రైజ్ చేస్తే... 'అయితే ఏంటి.. ఈ సినిమా బాగుంది' అని తడుముకోకుండా చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !